19.7 C
Hyderabad
Wednesday, December 3, 2025
spot_img

ఇంజనీరింగ్ అభ్యర్థుల కోసం అత్యుత్తమ JEE ప్రిపరేషన్ ప్రోగ్రామ్

హైదరాబాద్, మార్చి 5, 2025: పరీక్షా సిద్ధత సేవలలో దేశీయ నాయకుడైన ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL), ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ అభ్యర్థుల కోసం రూపొందించిన ఆకాశ్ ఇన్‌విక్టస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ విప్లవాత్మకమైన, అధునాతన, AI ఆధారిత, వ్యక్తిగతీకరించిన, ఫలితాలపై కేంద్రీకృత కార్యక్రమం IITలు లేదా ప్రఖ్యాత అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో చేరాలనుకునే విద్యార్థులకు అనుకూలంగా రూపొందించబడింది.

ఆకాశ్ ఇన్‌విక్టస్ దాదాపు 500 మంది అత్యుత్తమ. లక్షకు పైగా విద్యార్థులను IITలలో ప్రవేశం పొందేందుకు మార్గనిర్దేశం చేసిన JEE ఫ్యాకల్టీసభ్యులను ఒకచోట చేర్చి అసాధారణమైన రీతిలో మెంటార్షిప్‌ను అందిస్తోంది. ఈ కోర్సు అత్యాధునికమైనది మరియు IITల్లో టాప్ ర్యాంకులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిభావంతమైన విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించబడింది. ప్రోగ్రామ్‌లో సమగ్ర ఫిజిటల్ లెర్నింగ్ మరియు ప్రత్యేక అధ్యయన వనరులు ఉన్నాయి, ఇవి ఖచ్చితమైన,AI ఆధారిత, మరియు JEE అడ్వాన్స్‌డ్‌కు అనుకూలమైన ప్రిపరేషన్‌ను నిర్ధారిస్తాయి.

ఈ కఠినమైన ప్రోగ్రామ్‌లో JEE(అడ్వాన్స్‌డ్) పరీక్షకు ముందు చివరి దశలో లక్ష్యంతో కూడిన ప్రిపరేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చే సమగ్ర రివిజన్ మరియు పరీక్ష మాడ్యూల్ అందించబడుతుంది. విద్యార్థులకు ప్రత్యేకమైన సిలబస్, సందేహాల నివృత్తి సెషన్లు మరియు వారి ప్రదర్శనను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా జాగ్రత్తగా రూపొందించిన టెస్ట్ సిరీస్ అందించబడుతుంది. విద్యార్థులకు మరింత వ్యక్తిగతీకరించిన శ్రద్ధను అందించడానికి ఆకాశ్ ఇన్‌విక్టస్ చిన్న బ్యాచ్‌లను కలిగి ఉంటుంది.

ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ యొక్క MD&CEO శ్రీ దీపక్ మెహ్రోత్రా ఈ ప్రోగ్రామ్ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ : “ఆకాశ్ ఇన్‌విక్టస్ కేవలం కోచింగ్ ప్రోగ్రామ్ కాదు; ఇది IITల్లో టాప్ ర్యాంకులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థుల కోసం ఒక మార్గదర్శక ప్రయాణం. ఈ ప్రోగ్రామ్ దశాబ్దాల అనుభవం కలిగిన అత్యుత్తమ ఫ్యాకల్టీని, ఆధునిక బోధనా విధానాలను, వ్యక్తిగతీకరించిన, AI, సాంకేతిక ఆధారిత అభ్యాసంను ఒకచోట చేర్చింది. మా విద్యావేత్తలు లక్షలాది మంది విద్యార్థులను IITల్లో ప్రవేశం పొందేందుకు విజయవంతంగా మెంటర్ చేశారు. మా స్టడీ మెటీరియల్‌ను పూర్తిగా నూతనీకరించాం, ఇది మొత్తం సిలబస్‌ను కవర్ చేస్తూ, పరిశ్రమలోని అత్యుత్తమ నిపుణులచే అభివృద్ధి చేయబడింది. మీరు దీన్ని మించిన మెటీరియల్ రూపొందించగలిగితే, మేము మిమ్మల్ని సన్మానించి మా బృందంలో ఆహ్వానిస్తాం” అని అన్నారు.

ఆయనేమాట్లాడుతూ ,“కొన్ని నెలల క్రితం ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్ ఇప్పటికే 2500+ ప్రతిభావంతులైన విద్యార్థులను ఆకర్షించింది. మూడు ప్రధాన అంశాలు – వినూత్న బోధనాపద్ధతులు మరియు కోర్సువేర్, నిపుణులైన అధ్యాపకులు, అభివృద్ధి చెందిన AI టూల్స్ – పై నిర్మించబడిన ఈ ప్రోగ్రామ్ ద్వారా JEEసంసిద్ధతలో కొత్త ప్రమాణాలను రూపొందించనుంది. ఈ కొత్త లక్షణాలన్నీ ఆకాష్ యొక్క విశ్వసనీయత, నమ్మకం, సాంకేతిక నైపుణ్యంతో మద్దతు పొందాయి” అని అన్నారు.

ఈ ప్రోగ్రామ్‌లోని ముఖ్యాంశాల్లో ఒకటి అధ్యయన వనరుల వినూత్నతపై దృష్టి సారించడం. విద్యార్థులు చాప్టర్‌ వారీగా QR కోడ్‌లతో కూడిన ప్రాక్టీస్ వర్క్‌షీట్లు పొందుతారు, ఇవి విస్తృత పరిష్కారాలను మరియు దశల వారీగా మార్కింగ్ పద్ధతులను అందిస్తాయి. ఇది JEE సంసిద్ధతతో పాటు పాఠశాల మరియు బోర్డు పరీక్షల్లో విజయాన్ని సులభతరం చేస్తుంది. అదనపు ఫీచర్లగా ఒలింపియాడ్ పోటీ పరీక్షల కోసం వర్క్‌షాప్‌లు, గత JEE ప్రశ్నపత్రాల విస్తృతమైన ఆర్కైవ్‌ (చాప్టర్ వారీ విభజనలతో మరియు పరిష్కారాలతో), అలాగే JEE ఛాలెంజర్ వనరు – ఇది వ్యూహాలను మెరుగుపరచడానికి లోతైన విశ్లేషణలు, ప్రాక్టీస్ ప్రశ్నలు అందిస్తుంది.

అదనంగా, ఈ ప్రోగ్రామ్ ఫిజిటల్ స్టడీ మెటీరియల్స్‌ను అనుసంధానం చేస్తుంది, భౌతిక మరియు డిజిటల్ వనరుల బలాలను కలిపి క్లిష్టమైన సమస్యలను సులభతరం చేస్తుంది. అలాగే, నిపుణులైన అధ్యాపకులచే రికార్డు చేయబడిన వీడియో లెక్చర్లను అందించడంతో విద్యార్థులు తమ సౌలభ్యానికి అనుగుణంగా నేర్చుకోవచ్చు.

ఆకాష్ ఇన్విక్టస్‌లో ప్రవేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంటుంది, కేవలం ఉత్తమమైన మరియు అత్యంత కట్టుబడి ఉన్న విద్యార్థులను ఎంపిక చేయడానికి ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. 11వ తరగతిలో చేరే విద్యార్థులకు ఇది రెండేళ్ల ప్రోగ్రామ్‌గా,10వ తరగతిలో చేరే విద్యార్థులకు మూడేళ్ల ప్రోగ్రామ్‌గా రూపొందించబడింది. ఇది దేశవ్యాప్తంగా 25 నగరాలలో – ఢిల్లీ NCR, చండీగఢ్, లక్నో, మీరట్, ప్రయాగ్‌రాజ్, కన్పూర్, వారణాసి, జైపూర్, కోటా, పాట్నా, రాంచీ, బొకారో, కోల్‌కతా, దుర్గాపూర్, భువనేశ్వర్, ముంబై, పుణే, నాగ్‌పూర్, అహ్మదాబాద్,వదోదర, ఇండోర్, భోపాల్, హైదరాబాద్, చెన్నై మరియు బెంగళూరులో అందుబాటులో ఉంటుంది. ఈ కోర్సును అత్యున్నత విద్యా ప్రమాణాలు మరియు మారుతున్న పరీక్ష నమూనాలకు అనుగుణంగా రూపొందించడానికి ఒక ప్రత్యేకమైన పరిశోధనా బృందం కృషి చేసింది, తద్వారా విద్యార్థులకు మార్గదర్శకమైన విద్యను అందించగలుగుతుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్