దినేష్ కచ్వా అరాచకం నుండి తమను కాపాడి న్యాయం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతోంది ఆగ్రా స్వీట్స్ యజమాని కుమార్తె అనామిక ఘెష్. తమ పేరుతో ఉన్న స్వీట్స్ షాపు డాక్యుమెంట్లతోపాటు బంగారం, నగదు, మరో 2 కోట్ల విలువైన ప్రాపర్టీ డాక్యుమెంట్లను దినేష్ తీసుకువెళ్లాడని ఆరోపించిన ఆమె… షాప్ తన ఆధీనంలోకి తీసుకుని… తమపైనే కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వాపోయింది అనామిక. ఇవే ఆరోపణలతో దినేష్ కచ్వాపై మధురానరగ్, బోరబండ, సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. తమను న్యాయం చేయాల్సింది పోయి… పోలీసులు కూడా కబ్జాదారు డికే వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ తమ గోడును పట్టించుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.