టీ20 వరల్డ్ కప్‌లో ఇవాళ భారత్, ఆఫ్గనిస్తాన్ తలపడనున్నాయి. వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న సూపర్ 8 మ్యాచుల్లో ఇప్పటికే మొదటి మ్యాచ్‌లో USAపై దక్షిణాఫ్రికా గెలుపొందింది. ఇవాళ ఉదయం వెస్టిండీస్, ఇంగ్లాండ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 8వికెట్ల తేడాతో గెలిచింది. బార్బ డోస్ వేదికగా రాత్రి 8 గం.లకు భారత్, ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్‌లో భారత్ ఆఫ్గాన్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన 8 మ్యాచుల్లో ఏడింటిలో భారత్ పైచేయి సాధించింది.


