బీజేపీ మహిళా నాయకురాలు తమిళ నటి కస్తూరి తెలుగు ప్రజల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. రాజుల కాలంలో సేవకులుగా పని చేసేందుకు తెలుగు ప్రజలు తమిళనాడుకు వలస వచ్చారని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇటీవల తమిళనాడులో బీజేపీ నిర్వహించిన ఓ సభలో ఆమె మాట్లాడుతూ.. ద్రవిడ సిద్ధాంత వాదులపై విరుచుకపడ్డారు.
300 ఏళ్ల కిందట రాజుల అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకు విచ్చేశారని కస్తూరి అన్నారు. అలా వచ్చిన వారే ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు. మరి ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్న బ్రాహ్మణులను తమిళులు కాదని ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రస్తుతం స్టాలిన్ కేబినెట్‌లో ఐదుగురు మంత్రులు తెలుగు మాట్లాడేవారున్నారని గుర్తుచేశారు. ఇతరుల ఆస్తులు లూటీ చేయొద్దు… ఇతరుల భార్యలపై మోజుపడొద్దు… ఒక్కరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెప్పడం వల్లే ద్రవిడ సిద్ధాంతులు వారిని వ్యతిరేకిస్తున్నారని ఫైర్ అయ్యారు.