వైసీపీ సోషల్ మీడియా దెబ్బకు ఆస్పత్రి పాలైన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. బీపీ లెవెల్స్ పడిపోవడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. వైసీపీ ట్వీట్ల ధాటికి తట్టుకోలేక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
ఇటీవల లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలపై… టార్గెట్ చేసిన వైసీపీ సోషల్ మీడియా వింగ్.. గత రెండు రోజులుగా ఫోన్ కాల్స్ , మెసేజెస్ పెడుతూ… వేధిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కుటుంబ సమేతంగా ఫిర్యాదు చేశాడు.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి. పృథ్వీ కామెంట్స్‌కి హర్ట్ అయిన వైసీపీ నేతలు బాయ్ కాట్ లైలా హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు.
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో పాపులర్ అయిన పృథ్వీ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. సినిమా ప్రారంభంలో 150 గొర్రెలు ఉండేవని.. సినిమా చివరికి వచ్చేసరికి 11 మాత్రమే మిగిలాయి.. అదేమిటో అంటూ వైసీపీపై సెటైర్లు వేశాడు. సోషల్ మీడియాలో బాయ్ కాట్ లైలా అంటూ ట్యాగ్ లైన్ తో ట్రెండింగ్ చేయడం మొదలుపెట్టారు.
వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు పృథ్వీకి చుక్కలు చూపిస్తున్నారు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీ వైసీపీని కించపరిచేలా కామెంట్స్ చేశారంటూ ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాయ్ కాట్ లైలా అంటూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నడుపుతున్నాయి. ఇప్పటి వరకు ఎక్స్‌లో ట్వీట్లు వేశారు. పృథ్వీ క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు.