26.7 C
Hyderabad
Monday, April 13, 2026
spot_img

ఏసీబీ కస్టడీకి ఏసీపీ ఉమామహేశ్వరరావు

  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన CCS ACP ఉమామహేశ్వరావును ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు విచారించనున్నారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న ఉమా మహేశ్వరరావును తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఉస్మానియా హాస్పిటల్‌లో వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి ఉమా మహేశ్వరరావును తరలించనున్నారు. ఆయనను నిన్న సాయంత్రం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచగా.. మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఇవాళ్టి నుంచి ఉమామహేశ్వరరావును మూడు రోజుల పాటు విచారించ నున్నారు ఏసీబీ అధికారులు. ఆయన అక్రమాస్తులపై ఆరా తీయనున్నారు. ఉమా మహేశ్వర రావు కస్టడీ విచారణలో.. మరికొంత మంది అధికారుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో అరెస్ట్ అయిన ఏసీపీ ఉమామహేశ్వర్‌ రావు నివాసంలో సోదాలు సందర్భంగా భారీగా ఆస్తులు గుర్తించారు. 37 లక్షల నగదు, 60 తులాల బంగారం లభించాయి. దానితో పాటు స్థిర చరాస్తులను గుర్తించారు. ఆస్తుల విలువ మొత్తం 3.95 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. ఆయనను కస్టడీలోకి తీసుకొని ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన విషయాలపై లోతుగా ఏసీబీ అధికారులు లోతుగా ప్రశ్నించనున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం చంచల్‌గూడా వెళ్లి ఉమామహేశ్వర్‌రావును అదుపులోకి తీసుకోనున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్