తిరుపతి జిల్లా అడవికోడియంబేడులో 80 ఏళ్ల రాజమ్మను గొంతు కోసి చంపిన ఇలంగోవన్‌రెడ్డిని అరెస్ట్ చేసినట్లు పుత్తూరు రూరల్ సీఐ భాస్కర్‌నాయక్ తెలిపారు. రాజమ్మ రెండో కొడుకు కృష్ణారెడ్డికి ఇలంగోవన్ కొడుకు, మృతురాలికి మనవడు. రాజమ్మ భర్త ఆర్ముగంరెడ్డి పదేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో తన బాగోగులు చూస్తున్న పెద్దకొడుకు కుమారుడు హరికృష్ణకు రాజమ్మ ఆస్తిని సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ చేసిందని సీఐ చెప్పారు. చిన్నకొడుకు కృష్ణారెడ్డి- కోడలు గౌరి దంపతుల కుమారుడు ఇళంగోవన్ రాజ మ్మను హతమార్చాడన్నారు.