గేమ్ ఛేంజర్’ సినిమా ఫంక్షన్ సందర్భంగా విషాద ఘటన చోటు చేసుకుంది. ‘గేమ్ ఛేంజర్’ ఫంక్షన్‌కు వచ్చి తిరిగి వెళుతుండగా ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. అయితే ఈ సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజమండ్రి సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. శనివారం రాజమండ్రిలో జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అరవపల్లి మణికంఠ, తోకాడ చరణ్ అనే ఇద్దరు యువకులు వెళ్లారు. వీరిద్దరూ కాకినాడకు చెందిన వారు.
గేమ్ ఛేంజర్ ఈవెంట్ ముగిసిన తర్వాత ఇంటికి బయల్దేరారు. కాకినాడకు వెళ్తుండగా వీరి బైక్‌ను కార్గిల్ ఫ్యాక్టరీ వద్ద వ్యాను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కాకినాడకు చెందిన అరవపల్లి మణికంఠ, తోకాడ చరణ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. మణికంఠ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన చరణ్‌ను కాకినాడ జీజీహెచ్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.