గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. స్కీం వివరాలు ఇవ్వాలని ఆదేశిస్తూ తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య డైరెక్టర్‌కు లేఖ రాసింది. అయితే,.. ఇప్పటికే ఈసీఐఆర్ కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు.. వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. మరోపక్క ఇదే కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన ఏసీబీ ఇప్పటి వరకూ 10 మందిని అరెస్ట్ చేశారు. ఓఎస్డీ కళ్యాణ్, మాజీ డైరెక్టర్ రామచందర్ అరెస్టు సహాల పలువురిని అరెస్ట్ చేసి కూపీ లాగుతోంది. అయితే,.. కస్టోడీయల్ విచారణలో కల్యాణ్, రామచందర్లు ఎలాంటి వివరాలు తెలపలేదని సమాచారం.
ఈడీ అడిగిన వివరాలతో పాటు మరికొన్ని వివరాలు తెలపాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించింది ఏసీబీ. దీంతో వివరాలు సేకరించే పనిలోపడ్డారు తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ఆఫీసర్లు. ఈ నేపథ్యంలోనే అటు జిల్లా కలెక్టర్ల నుంచి కూడా వివరాలు రాబడుతున్నారు. రెండు విడతల్లో జరిగిన మెడిసిన్, లాజిస్టిక్స్ వివరాలు ఇవ్వాలని తెలిపింది. ఏసీబీ దర్యాప్తు కోసం లబ్ధిదారుడు, అమ్మకదారుడు వివరాలు, బ్యాంకు ఖాతా, డేట్ ఆఫ్ గ్రౌండింగ్, ట్రాన్స్‌పోర్టు, ఇన్వాయిస్లతో సహా పూర్తి వివరాలు ఇవ్వాలని సూచించింది.


