వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశంలో కీలక అంశాలపై చర్చిం చారు పార్టీ నేతలు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఈ భేటీకి హాజరయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఓటమిపై విశ్లేషించారు. అలాగే భవిష‌్యత్తులో పార్టీని బలోపేతం చేసే విషయంపై జగన్ నేతలకు దిశానిర్దేశం చేశారు.జగన్ ఓదర్పు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆ దిశగా సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. ఎన్నికల తర్వాత కార్యకర్తలపై దాడులు పెరిగాయిని జగన్ అన్నారు. కొంతమందిని అవమా నిస్తున్నారని, ఆస్తుల నష్టం చేస్తున్నారని అన్నారు. నష్టపోయిన కార్యకర్తలను తాను త్వరలో కలుస్తానని చెప్పారు.