ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పటి నుంచే లైంగికంగా వేధించారన్న ఆరోపణలతో నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మరోవైపు జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేశారు. ఈ మేరకు పరారీలో ఉన్న జానీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. లడఖ్‌లో ఉన్నాడన్న సమాచారంతో.. పోలీసుల ప్రత్యేక బృందం లడఖ్ బయలుదేరింది.