26.2 C
Hyderabad
Saturday, February 14, 2026
spot_img

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాకిచ్చింది. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నాలుగు వారాల గడువు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోకపోతే.. సుమోటోగా తీసుకుంటామని హెచ్చరించింది.

బీఆర్ఎస్ బీ-ఫామ్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ముగ్గురిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై వాదనలను ముగించిన హైకోర్టు తీర్పును వెలువరించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌లపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు ఇచ్చింది.

అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానందగౌడ్‌లు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీని ఫిరాయించినందుకు డిస్‌క్వాలిఫై చేయాలంటూ స్పీకర్‌ కార్యాలయంలో నోటీసులు ఇచ్చామని, ఇప్పటివరకు స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని వారు పిటిషన్‌లో తెలిపారు. దీంతో ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు.. వేటు వేయాలని స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్