PM Modi on Mann Ki Baat | సిరిసిల్ల నేతన్నకు అరుదైన గౌరవం దక్కింది. చేనేత వస్త్ర నైపుణ్యంతో అద్భుతాలు సృష్టించిన నేత కార్మికుడు వెళ్ది హరిప్రసాద్ కు ప్రధాని మోడీ మన్‌కీ బాత్ 100వ ఎపిసోడ్ కై రాజ్ భవన్ నుండి పిలుపు అందింది. ప్రధానమంత్రి మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ వీక్షించాలని తెలంగాణ గవర్నర్ తమిళసై నుండి హరిప్రసాద్ పిలుపు వచ్చింది. దీంతో తన ప్రతిభ గుర్తించిన ప్రధానమంత్రి మోడీ, గవర్నర్ తమిళ్ సై, అధికారులకు హరి ప్రసాద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సిరిసిల్ల జిల్లా ప్రజలే కాకుండా యావత్తు తెలంగాణ ప్రజానీకం నేతన్నకు గౌరవం దక్కడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చేనేతపై ప్రత్యేక చొరవతో హరిప్రాసాద్ అనేక వినూత్న ప్రయోగాలు చేశాడు. బుల్లి మరమగ్గాలు, అగ్గిపెట్టలో ఇమిడే వెండి చీర, దబ్బనం సూదిలో దూరే చీరలు, కెసిఆర్, కేటీఆర్, ముఖచిత్రాలు, ఆజాద్ కి అమృతం మహోత్సవం సందర్భంగా జాతీయ గీతం, భారతదేశ ముఖచిత్రం ఒకే వస్త్రం పై వచ్చే విధంగా అనేక వస్త్రాలను నేశాడు. అంతేకాకుండా మహాత్మా గాంధీజీ 150వ జన్మదినం సందర్బంగా గాంధీజీ నూలు వాడుతున్న విధానం, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఫోటోతో నేసిన వస్త్రం, రాజన్న సిరిపట్టు నామ కరణం..ఇలా అనేక వినూత్న ప్రయోగాలు చేశాడు.