వ్యక్తిగత నైపుణ్యాల పెంపుతోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువ వస్తాయని.. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. నేడు విలువలతో కూడిన విద్య వ్యక్తికి, కుటుంబానికి చాలా అవసరం అన్నారు. ప్రధాన మంత్రి నూతన విద్యా విధానం ద్వారా మాతృభాషలోనే సాంకేతిక విద్యను బోధించే దిశగా కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. తల్లిని, మాతృభాషని, తన ఊరిని, దేశాన్ని మరిచిపోయిన వ్యక్తి మనిషే కాదని వెంకయ్య అన్నారు. అంతకుముందు కృష్ణా జిల్లా ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్టులో నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. దీనికి వెంకయ్య నాయుడుతో పాటు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హాజరయ్యారు.