రేపు ఉదయం టీడీపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ గవర్నర్ కు లేఖ ఇవ్వను న్నారు కూటమి నేతలు.
మరోవైపు ఢిల్లీ పర్యటన ముగియడంతో చంద్రబాబు అమరావతి బయల్దేరారు. నిన్న కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరయ్యారు. అనంతరం అమరావతి బయల్దేరారు. ఎల్లుండి ఉదయం చంద్రబాబు ఏపీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఇందుకోసం గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోదీతోపాటు పలువురు ప్రముఖులు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానుండంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్ర బాబు ప్రమాణ స్వీకారం అనంతరం తిరుమల వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం అమరావతి బయల్దేరనున్నారు.


