బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా జూలై 5న బంద్ కు పిలుపునిస్తూ మావోయిస్టులు విడుదల చేసిన లేఖ కలకలం రేపుతోంది. బొగ్గు బ్లాకులను సాధించుకునే వరకు పోరాడాలని… జూలై 5 బంద్ ను.. నిరసన కార్యక్రమాలను విజయ వంతం చేయాలని పిలుపునిచ్చింది. మోడీకి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కండి అంటూ మావోయిస్టు అనుబంధ కార్మిక సంఘం సింగరేణి కార్మిక సమాఖ్య కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ లేఖలో పేర్కొన్నారు. ఫాసిస్టు మోడీ ప్రభుత్వం దేశంలోని బొగ్గు గనులను ప్రైవేటీకరించే కుట్రలో భాగంగా వేలం వేయడాన్ని నిరసిస్తూ సింగరేణి సత్తుపల్లి, కోయగూడెం, KK-6, శ్రావణపల్లి గనులను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు.
సత్తుపల్లి, కోయగూడెంలో కూడా ఉపరితల గనులకు బదులుగా అండర్ గ్రౌండ్ గనులు తవ్వాలని.. దీని ద్వారా చుట్టు పక్కల గ్రామాల వ్యవసాయ భూములను కాపాడడంతో దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుంద న్నారు. అండర్ గ్రౌండ్స్ గనుల వల్ల నష్టపోయిన భూ నిర్వాసితులకు ప్రస్తుత మార్కెట్ ప్రకారం నష్టపరిహారం ఇవ్వడంతో భూ నిర్వాసితులకు సంస్థలో పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని లేఖలో డిమాండ్ చేశారు. గతంలో గనుల తవ్వకం కోసం భూములు తీసుకున్న తర్వాత రైతులకు, భూ నిర్వాసి తులకు న్యాయం చేయకుండా మోసగించిన చరిత్ర సింగరేణి, రెవిన్యూ అధికారులకు ఉందని ఆ అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గుబ్లాకుల వేలాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిలిపివేసి నేరుగా సింగరేణి కంపెనీకి అప్పగించాలని సీపీఎం డిమాండ్ చేసింది. కలెక్టరేట్ ఎదుట బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. గతంలోనే మోడీ ప్రభుత్వం నాలుగు బ్లాకులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించిందని మండిపడ్డారు.
బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి హైదరాబాద్ కేంద్రంగానే వేలం పాట ప్రక్రియను ప్రారంభిం చడం అన్యాయమన్నారు. బొగ్గు బ్లాకులన్నీ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన తర్వాత సింగరేణికి మిగిలేదే ముందన్నారు. క్రమంగా సింగరేణి సంస్థ బలహీనపడి మూతపడే వైపు మోడీ ప్రభుత్వం నెట్టుతుం దన్నారు. ఈ ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు అడ్డుకోవాలని సీపీఎం కోరింది. తెలంగాణకు మణిహారం గా ఉన్న సింగరేణిని కాపాడుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కదలాలని పిలుపునిచ్చింది.
పదేళ్లలో మోడీ ప్రభుత్వం సుమారు 200 బొగ్గు బావులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిందన్నారు. రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణకు ఇంత అన్యా యం జరుగుతుంటే నోరు మెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


