రఘురామకృష్ణరాజు పిటిషన్లపో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మరోసారి మార్చాడు. జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీశ్ ధర్మాసనానికి కేసును బదిలీ చేశారు. గతంలో జస్టిస్ అభయ్, జస్టిస్ పంకజ్ ధర్మాసనం విచారించింది. 12 ఏళ్లుగా ట్రయల్ సరిగ్గా జరగలేదని రఘురామకృష్ణరాజు లాయర్ కోర్టులో వాధించారు. సీబీఐ, నిందితులు కుమ్మక్కు అయ్యారని… దీంతో కేసులో అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. వాదనలు విని నిర్ణయం వెలువరించే సమయంలో ఐదుగురు జడ్జీలు బదిలీ అయ్యారన్న విషయాన్ని రఘురామ లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు.