రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ముఖ్యంగా రెపోరేటును 6.5 శాతం వద్దనే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. రెపో రేటును ఆర్బీఐ యథాతథంగా కొనసాగించడం ఇది వరుసగా ఎనిమిదోసారి. ద్రవ్యోల్బణం వృద్ధి ప్రస్తుతానికి చాలా బ్యాలెన్స్డ్గా ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద ఉంచడానికి ఆర్బీఐ కట్టుబడి ఉందని పేర్కొన్నా రు. అయితే ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


