తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈనెల 6న భేటీ కాబోతున్నారు. ఇందుకు హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వేదిక కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ విధివిధానాలు, చర్చించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. విభజన చట్టం, రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించి ఓ క్లారిటీకి రానున్నారు. పదేళ్లలో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన చర్యలను సమీక్షిస్తారు. తెలం గాణ హక్కులకు భంగం కలగకుండా సమస్యల పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టనున్నారు. ఏపీ సీఎంతో చర్చల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో ఓ స్పష్టతకు రానున్నారు. ఉన్నతస్థాయి సమావేశం తర్వాత చంద్రబాబుకు సమాధానం ఇవ్వనున్నారు రేవంత్‌రెడ్డి