జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలందరూ పవన్ కళ్యాణ్ ను శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కళ్యాణ్ పేరును ప్రతిపాదించారు నాదెండ్ల మనోహర్. మిగిలిన సభ్యులు అందరూ ఏకగ్రీవంగా బలపరిచారు. కొత్తగా ఏర్పాడబోయే ప్రభుత్వంలో జనసేన పార్టీకి 4 మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ తో పాటు సోషల్ మీడియాలో మరో రెండు పేర్లు బాగా ప్రచారం అవుతున్నాయి. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్‌లకు మంత్రులుగా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంటున్నారు. అయితే వీరిద్దరికి రాజకీయ అనుభవం కూడా ఉండటంతో ఈ అంశా లను కూడా పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.