స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్‌కు ఓ కానిస్టేబుల్ అడ్డుపడ్డారు. గుంటూరు నుంచి క్యాంపు కార్యాలయానికి సీఎం తిరిగి వస్తున్న సమయంలో సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు కానిస్టేబుల్ ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో కానిస్టేబుల్‌ను విధుల్లో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భద్రతా సిబ్బంది ఆ కానిస్టేబుల్ ను ప్రశ్నిస్తున్నారు.