Khammam Accedent | కూలిపనులకు వెళ్తున్న 15 మంది మహిళలతో కూడిన ఆటోను అతివేగంతో వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే… ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూర్ అంబేద్కర్ నగర్‌కు చెందిన కొంతమంది మహిళా కూలీలు.. రోజు వారి పని రీత్యా మిరపకాయలు కోయడానికి ఆటోలో 15 మంది ఏన్కూరుకు బయల్దేరారు. ఈ క్రమంలో అతివేగంతో వస్తున్న ఓ కారు లారీని ఓవర్ టేక్ చేయబోయి ఆటోను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 8 మందికి తీవ్ర గాయాలు కావడంతోవారిని ఆసుపత్రికి తరలించగా.. ఇద్దరు మహిళలు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు వరమ్మ (40), వెంకటమ్మ(45) గా పోలీసులు తెలిపారు.