Shabarimala Accedent | ప్రమాదవశాత్తు అయ్యప్ప భక్తుల బస్సు లోయలో పడిన ఘటన నిలక్కల్ సమీపంలోని ఎలావుంకల్ వద్ద జరిగింది. శబరి మల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న అనంతరం భక్తులతో వస్తున్న బస్సు ఈరోజు మధ్యాహ్నం 1.30 గంట సమయంలో లోయలోకి జారిపడింది. అయితే ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 64 మంది భక్తులు, 9 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో 62 మందికి గాయాలు కాగా.. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.