జమ్మూ కాశ్మీర్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆర్మీ వాహనంలో భారీగా మంటలు చెలరేగంతో నలుగురు జవాన్లు సజీవదహనం అయ్యారు. ఫాంజ్ జమ్మూ హైవే పై ఈ దుర్ఘటన జరిగింది. మంటలు చూసిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే వాహనం పూర్తిగా తగలబడి పోయింది. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.