ట్విట్టర్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఎవరైనా ఆపదలో ఉన్నారని ట్వీట్ చేస్తే చాలు వారిని ఆదుకోవడానికి తన వంతు కృషి చేస్తారు. తాజాగా హైదరాబాద్ నగరానికి చెందిన సాయి తేజస్వీ అనే యువతి బ్రిటన్ లోని క్రాన్‌ఫీల్డ్ యూనివర్శిటీలో ఏరోనాటిక్స్, స్పేస్ ఇంజనీరింగ్ మాస్టర్స్ చేస్తోంది. అయితే ఈ నెల 11న ఆమె బ్రైటన్ బీచ్‌లో గల్లంతై చనిపోయింది. అక్కడి ఆమె మృతదేహాన్ని వెలికితీసి యూకేలోని ఓ ఆసుపత్రిలో ఉంచారు.
దీంతో ఆ యువతి సోదరి ప్రియారెడ్డి మా అక్క యూకే మరణించిందని.. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు హెల్ఫ్ చేయండి సార్ అంటూ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేసింది. వెంటనే స్పందించిన కేటీఆర్ మీ కుటుంబానికి జరిగిన నష్టానికి చాలా చింతిస్తున్నా.. నా బృందం స్థానిక బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ బృందంతో చర్చలు జరుపుతోందని.. వీలైనంత త్వరగా మీకు సహాయం అందిస్తామని హామీ ఇస్తూ రీట్వీట్ చేశారు.
Very sorry for your loss
My team @KTRoffice will work with local British Deputy High Commissioner’s team @UKinHyderabad to assist asap https://t.co/92BX6OmcOJ
— KTR (@KTRBRS) April 17, 2023