టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి(DL Ravindra reddy) సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజురోజుకు జగన్ పై ప్రజావ్యతిరేకత ఎక్కువ అవుతుండడంతో 2024 ఎన్నికల్లో అధికారం కోసం జగన్(Jagan) ఎంతకైనా బరితెగించే అవకాశం ఉందన్నారు. అందుకే ఆయన సోదరి షర్మిల(Sharmila), తల్లి విజయమ్మ(Vijayamma) జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గత ఎన్నికల్లో బాబాయ్ వివేకా హత్య కేసును అడ్డం పెట్టుకుని ఆ సానుభూతితో జగన్ అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ కు ప్రజలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారన్నారు. కోడికత్తి కేసులో ఎలాంటి కుట్ర లేదని NIA తేల్చినా కానీ.. కుట్ర ఉందని మళ్లీ పిటిషన్ వేయడం సిగ్గుచేటని డీఎల్ మండిపడ్డారు.