ఖమ్మం జిల్లా(Khammam ) కారేపల్లి మండలం చీమలపాడులో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం నెలకొంది. ఆత్మీయ సమ్మేళననానికి ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ వస్తుండడంతో పార్టీ కార్యకర్తలు బాణసంచా పేల్చారు. దీంతో గుడిసెకు నిప్పంటుకొని.. లోపల ఉన్న సిలిండర్లు పేలిపోయాయి. ఈ పేలుడు ధాటికి పలువురి కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. అక్కడే ఉన్న పోలీసులకు, జర్నలిస్టులకు తీవ్ర గాయాలు అయ్యాయి. విధులు నిర్వహిస్తున్న సీఐతో సహా 10 మంది కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. దీంతో వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.
Read Also: టిడ్కో ఇళ్ల దగ్గరకు వెళ్లి ఈ ముసలాయన సెల్ఫీ ఛాలెంజ్ అంటాడు: సీఎం జగన్
Follow us on: Youtube, Koo, Google News