Fire accident in DELHI | దేశంలో ఈసారి ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి తాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదుకావడంతో కొన్నిచోట్ల అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాగే దేశ రాజధాని ఢిల్లీలోని టిక్రీ కలాన్ పీవీసీ మార్కెట్ లో ఉన్న ఓ ప్లాస్టిక్ గోడౌన్ లో శుక్రవారం అర్థరాత్రి, శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సెగ గాలి ఎక్కువగా ఉండడంతో మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకూ వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు 20 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు. అయితే గోడౌస్ లో ఉన్న ప్లాస్టిక్ వస్తువులన్ని కాలి బూడిద అవ్వడంతో దట్టమైన పొగ కిలోమీటర్ మేర వ్యాపించింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కాగా ఇంతకుముందు కూడా ఢిల్లీ(Delhi)లోని సమల్కాలో ఉన్న గోడౌన్‌లో కూడా అగ్నిప్రమాదం సంభవించింది. ఎండాకాలం కావడంతో మంటలు వ్యాపించకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also: కివీస్-లంక టీ20 మ్యాచ్ మధ్యలో విమానం టేకాఫ్
Follow us on: Youtube, Instagram, Google News