చాట్ జీపీటీ(Chatgpt)..ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువగా వినిపిస్తున్నపేరు. ఏఐ(AI)సాంకేతిక ఆధారంగా రూపుదిద్దుకున్న చాట్ జీపిటీ టెక్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏ రంగానికి సంబంధించిన సమాచారం కావాలన్నా అందుబాటులో ఉన్న పూర్తి సమాచారాన్ని విశ్లేషించి మనకు అందిస్తూ ప్రత్యేకత చాటుకుంటుంది. తాజాగా కొంత మందికి డబ్బులు ఎలా సంపాదించాలి, ఏ రంగంలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయో చెబుతూ ఆదాయాన్ని సైతం తెచ్చిపెడుతుంది.
అలాంటి చాట్ జీపీటీ(Chatgpt)పై చాలా దేశాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. దీంతో ఇప్పటికే రష్యా, ఉత్తర కొరియా, చైనా, ఇరాన్ దేశాలు దీనిని నిషేధించగా… తాజాగా ఇటలీ కూడా చాట్ జీపీటీపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. డేటా నియమాల ఉల్లంఘన కేసు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇటలీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ వెల్లడించింది. అలాగే మరికొన్ని దేశాలు కూడా ఈ టెక్నాలజీని బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.