26.2 C
Hyderabad
Friday, December 27, 2024
spot_img

బీజేపీ నేతలను ఏపీలో ఎదగనివ్వడం లేదు: సోము వీర్రాజు

ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు ఉందా?లేదా? అనే దానిపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. జనసేనతో పొత్తుపై బీజేపీ నేత మాధవ్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు జనసేన నుంచి ఎంత సహకారం అందిందో ప్రజలే ఆలోచించాలని తెలిపారు. కేంద్రంలోని మోదీని పొగుడుతారని.. రాష్ట్రంలో మాత్రం బీజేపీ నేతలను ఎదగనివ్వరని ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ-జనసేన పొత్తు ఉండకూడదని కొంతమంది కోరుకుంటున్నారని.. వారి కోరిక ఎప్పటికీ ఫలించదని స్పష్టంచేశారు. కాగా బీజేపీ తమతో కలిసి రావడం లేదని ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ నేత మాధవ్ జనసేననే తమతో కలిసి రావడం లేదని కౌంటర్ ఇచ్చారు. దీంతో జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందా?లేదా? అనే చర్చ మొదలైంది.

Latest Articles

విద్యుత్ ఛార్జీలు పెంచడంపై వైసీపీ పోరుబాట

విద్యుత్ ఛార్జీలు పెంచడంపై వైసీపీ పోరుబాట చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు అధిష్టానం పిలుపునిచ్చింది. ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం మోపిందని ఫ్యాన్ పార్టీ మండిపడుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్