దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:39 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 194.79 పాయింట్లు లాభపడి 57,823.74 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 49.25 పాయింట్లు లాభపడి 17,037.65 దగ్గర ట్రేడ్ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ₹82.65గా కొనసాగుతుంది. భారతీ ఎయిర్‌టెల్, నెస్లే ఇండియా, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇక నష్టాల్లో కొనసాగుతున్న వాటిలో టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫీ షేర్లు ఉన్నాయి.