విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న రెండవ వన్డేలో టీమిండియా ప్లేయర్లు ఘోరంగా విఫలమయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీసీ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ ధాటికి వరుసపెట్టి వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, గిల్, హార్దిక్ పాండ్యా తీవ్రంగా నిరాశపరిచారు. ఇక మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ వరుసగా రెండవ వన్డేలో కూడా గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. కోహ్లీ అత్యధికంగా 31 పరుగులు చేశాడు. ఇక చివర్లో అక్షర్ పటేల్(29) కాస్త ధాటిగా ఆడడంతో టీమిండియాకు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. దీంతో వన్డేల్లో మూడవ అత్యల్ప స్కోరు నమోదుచేసింది భారత్.