AP News |ఏపీ సీఎం జగన్ ఆ రాష్ట్రంలోని పెన్షన్‌దారులకు శుభవార్త చెప్పారు. వచ్చే జనవరి నెల నుంచి పెన్షన్ పెంచుతున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం 2750 రూపాయలు ఉన్న పెన్షన్ వచ్చే జనవరి నుంచి 3000 రూపాయలు అవుతుందని తెలిపారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా పెన్షన్ పెంచుతూ వస్తోంది. 2020 సంవత్సరంలో 2021లో 2,250 రూపాయలు ఇవ్వగా.. 2022లో 250 రూపాయలు పెంచి రూ.2,500 ఇచ్చింది. 2023 జనవరి 1 నుంచి మరో 250 రూపాయలు పెంచి 2,750 రూపాయలు ఇస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే 2024 జనవరి 1 నుంచి 3వేల రూపాయలను లబ్ధిదారులకు అందించనుంది.


