బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన నటి మాధురి దీక్షిత్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తల్లి స్నేహలత దీక్షిత్ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.ఈ విషయాని మాధురి దీక్షిత్ దంపతులు వెల్లడించారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మాధురి కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నారు.పలువురు మాధురి కుటుంబ సభ్యులు ఆమె ఇంటివద్దకు చేరుకొని నివారలులర్పిస్తున్నారు. స్నేహలత అంత్యక్రియలను ముంబయిలోని వోర్లీలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
తల్లి మరణంతో మాధురి తీవ్ర భావోద్వేగానికి లోనై.. ‘ఆమె ప్రశాంతంగా తనకు ఇష్టమైన వారి మధ్య, వారిని చూస్తూనే స్వర్గానికి పయనమయ్యారు’ అంటూ బాధను వెల్లడించారు. గత ఏడాది తన తల్లి బర్త్డే సందర్భంగా ఆమెకు విషెస్ చెబుతూ.. మాధురి దీక్షిత్ సామాజిక మాధ్యమాల్లో ఓ ఎమెషనల్ పోస్ట్ షేర్ చేశారు . ‘హ్యాపీ బర్త్ డే అమ్మా.. కూతురికి అమ్మే మంచి ఫ్రెండ్ అని అంటుంటారు.. అది నిజమే కదా? మీరు నా కోసం చేసినవన్నీ, నాకు నేర్పిన విషయాలన్నీ కూడా నాకు బహుమతులే’ అంటూ రాసుకొచ్చారు.