Bangladesh |బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని 7 అంతస్తుల పాడుబడిన భవనంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి 14 మంది మరణించగా.. దాదాపు 100 మందికి పైగా వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం 4గంటల సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. భవనం క్రింది అంతస్తులో జరగటం వలన ఏడు అంతస్తుల భవనం తీవ్రంగా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. కాగా, ఈ పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. Bangladesh
Read Also: ‘ఓ మహిళా’.. నీకు నువ్వే సాటి..!!!
Follow us on: Youtube Instagram