24.3 C
Hyderabad
Monday, July 14, 2025
spot_img

జ్యోతిర్వస్తు..కైలాసమస్తు – ఫసల్వాది పీఠంలో శివరాత్రి వైభవం

గరళ కంఠుడు, సరళ హృదయుడు, భక్త వరదుడు సదా శివుడు. శివ దేవుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేది పెద్దల వాక్కు. అంతటి దేవాది దేవుడు, ఆది దేవుడు, మహదేవుడి మహా శివరాత్రి వేడుక అంటే భక్తులు ఎంత ఆనంద సాగరంలో తేలియాడుతారో ప్రత్యేకించి చెప్పేదేముంది. శివ దేవుని రూపాన్ని ఎక్కడా లేనివిధంగా అత్యద్భుతంగా ఆవిష్కరించడానికి , మహోన్నత రీతిలో ముక్కంటి శివరాత్రి పండగ జరపడానికి జ్యోతిర్వస్తు విద్యాపీఠం సమాయత్తం అయ్యింది.

శంభు రీశః పశుపతి శివశ్శూలి మహేశ్వరః.. ఇది అమరకోశ వైభవం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాన్తకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ, మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమః.. ఇది నమక చమక పారాయణం.. ఇలా విశేష పూజలు, అభిషేకాలు, బిల్వార్చనలతో విశ్వవ్యాప్తంగా శివాలయాలు మహా శివరాత్రి మహోత్సవాలకు సిద్దం అయ్యాయి. శివుడి రూపాన్ని ఎక్కడా లేని విధంగా ఆవిష్కరించి, భక్తులను ఆధ్యాత్మిక సాగరంలోకి తీసుకువెళుతూ.. వినూత్న రీతిలో శివరాత్రి వేడుక చేయడానికి జ్యోతిర్వస్తు విద్యాపీఠం సంకల్పించింది.

సంగారెడ్డి జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఫసల్వాది అనే గ్రామం నెలకొని ఉంది. ఈ పల్లె శివారులో 2018లో ప్రముఖ సిద్ధాంతి మహేశ్వర శర్మ జ్యోతిర్వస్తు విద్యాపీఠాన్ని ప్రారంభించారు. అయితే, ఈ ఆధ్యాత్మిక కేంద్రం ధార్మిక పరిరక్షణకు పాటుపడుతూ, ఆధ్యాత్మిక వైభవాన్ని నలుదెసలా విస్తరింపచేస్తోంది. మరోవైపు సమాజ సేవలో తరిస్తోంది. ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళుతోంది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఈ పీఠం ఓ ఆలయాన్ని నిర్మించబోతుంది.

ప్రాచీన ప్రాభవాన్ని, ఆధునిక సొబగులు మేళవించి.. కేవలం ఏకశిలతో, డంగు సున్నంతో కైలాస సరోవరాన్ని తలపింప చేస్తూ, మేరు పర్వత రూపంలో, శ్రీ చక్ర ఆకారంలో శివాలయాన్ని నిర్మించబోతోంది. గత ఏడేళ్లుగా ఈ ఆలయ నిర్మాణం కొనసాగుతోంది. మరో ఏడేళ్లు ఈ నిర్మాణం సాగేటట్టు కనిపిస్తోంది. శ్రీరామ చంద్రుని వనవాసం పధ్నాలుగేళ్లే, పాండవుల అరణ్యవాసం పధ్నాలుగేళ్లు… ఈ ఆలయ నిర్మాణం పధ్నాలుగేళ్లు అంటే.. అటూ త్రేతాయుగ వైభవం, ఇటు ద్వాపర యుగ ప్రాభవం…సమ్మిళతమై… శివ దేవుని శోభాయమాన దేవళం నిర్మితం కాబోతోంది. ప్రపంచంలో ఎక్కడా కానరాని విధంగా జ్యోతిర్వస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్మితమవ్వడం తమకు ఎంతో సంతోషంగా ఉందని స్థానికులు, భక్తజనులు ఆనంద పరవశులవుతున్నారు.

ప్రతి వత్సరం శివరాత్రి పర్వదినాన్ని జ్యోతిర్వస్తు విద్యాపీఠం వైభవోపేతంగా నిర్వహిస్తోంది. శివరూపాన్ని లింగాకారంలో ఆవిష్కరించి పూజాదికాలు, అభిషేకాలు ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తొలుత 2022 లో 15 అడుగుల శివలింగాన్ని బిల్వపత్రాలతో ఆవిష్కరించారు. 2023లో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసి, ఆ విశేష శిల్పానికి విశేష రీతిలో అభిషేకం చేసి అబ్బుర పర్చారు.
2024లో భస్మలింగాన్ని ఏర్పాటు చేసి పూజలు, అభిషేకాలు చేశారు. కేవలం రామేశ్వరంలో మాత్రమే సైకత లింగం కనిపిస్తుందని, అయితే అక్కడ అభిషేకం జరగదని పీఠం పెద్దలు తెలిపారు. అయితే, ఇక్కడ ఏర్పాటు చేసిన సైకత లింగానికి అభిషేకం సైతం కన్నుల పండువగా నిర్వహించడం గమనించదగ్గ విషయం.

విద్యాపీఠం వ్యవస్థాపకులు మహేశ్వర సిద్ధాంతి.. ఎప్పటిలాగే ఈ ఏడాది సైతం వినూత్నంగా ఆలోచన చేశారు. దాదాపు పద్దెనిమిదిన్నర అడుగులతో కోటి ఎనిమిది లక్షల రుద్రాక్షలతో ఈ ఏడాది రుద్రాక్ష లింగాన్ని ఏర్పాటు చేసి మహిమాన్విత శివరాత్రి పర్వదినాన్ని మహత్తరంగా నిర్వహించడానికి సమాయత్తం అయ్యారు. రుద్రాక్ష శివలింగానికి భక్తులతో అర్చనలు అభిషేకాలు చేయిస్తూ పీఠాన్ని అత్యద్భుత ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లారు. శివరాత్రి పర్వదినం నాడు దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు ఈ రుద్రాక్ష శివలింగాన్ని దర్శనం చేసుకోనున్నారని పీఠం నిర్వాహకులు తెలిపారు.

పీఠంలో శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న భక్తులందరికీ అభిషేక కార్యక్రమాలు నిర్వహించి, ప్రతి ఒక్క భక్తుడికి రుద్రాక్షని ఆశీస్సులుగా ఇస్తామని మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. నేపాల్ పశుపతినాథ్ దేవాలయ పరిసర ప్రాంత రుద్రాక్ష వృక్షాలనుంచి వీటిని తీసుకొచ్చినట్టు ఆయన వెల్లడించారు. ఈ పీఠానికి వచ్చిన భక్తులకు ఆ రుద్రుడి కరుణాకటాక్షాలు ఎప్పుడూ ఉంటాయని సిద్ధాంతి తెలిపారు

జన్మానికల్లా శివరాత్రి అని పెద్దలు అంటూ ఉంటారు. ఈ పీఠం మహోన్నత రీతిలో చేపడ్తున్న మహా శివరాత్రి వేడుకలు, శ్రీ చక్ర ఆకార శివాలయ నిర్మాణం.. అన్ని చూస్తుంటే..ఈ శివరాత్రి నిజంగానే జన్మానికల్లా శివరాత్రి అనే వాక్కు సార్థం అయినట్టు కనిపిస్తోందని భక్తజనులు ఉప్పొంగిపోతున్నారు.
———-

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్