చైనాలో మరో కొత్త వైరస్‌ను కనుగొన్నారు. కోవిడ్ 19 మహమ్మారికి కారణమైన వైరస్ మాదిరిగానే జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదాన్ని కలిగి ఉన్న కొత్త కరోనా వైరస్‌గా గుర్తించారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) ప్రకారం, HKU5-CoV-2 అనే కొత్త వైరస్‌ను “బ్యాట్‌వుమన్” అని పిలువబడే ప్రఖ్యాత శాస్త్రవేత్త షి జెంగ్‌లీ నేతృత్వంలోని వైరాలజిస్టుల బృందం కనుగొంది. ఆమె కరోనా వైరస్‌పై వుహాన్ ఇన్‌స్టిట్యూట్‌లో విస్తృత పరిశోధనలు చేసి బ్యాట్ వుమెన్‌గా పేరుపొందారు. రు. ఈ వుహాన్ ప్రయోగశాల నుంచే COVID-19 వైరస్ లీక్ అయిందని ప్రచారం జరిగింది. దీన్ని చైనా ఖండించింది.
కోవిడ్ మహమ్మారికి కారణమైన వైరస్ SARS CoV-2 తో ఈ కొత్త వైరస్ సారూప్యతలను కలిగి ఉందని చైనా పరిశోధకులు గుర్తించారు. ఎందుకంటే ఇది కూడా కోవిడ్ మాదిరిగానే ACE2 అని పిలువబడే మానవ కణాలలోకి చొచ్చుకుపోగలదని నివేదికలు చెబుతున్నాయి.
HKU5-CoV-2 అంటే ఏమిటి?
HKU5-CoV-2 అనేది మెర్బెకోవైరస్ ఉపజాతికి చెందిన కరోనావైరస్, ఇది మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS)కు కారణమయ్యే వైరస్ . కొత్త వైరస్ మానవ ACE2తో చేరిపోగలదని, ఇది SARS-CoV-2, సాధారణ జలుబు వైరస్ అయిన NL63మాదిరిగా ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ల్యాబ్ టెస్టుల్లో , శాస్త్రవేత్తలు ఉపయోగించిన మినీ-హ్యూమన్ ఆర్గాన్ మోడల్‌లలో HKU5-CoV-2 మానవ కణ కల్చర్‌ను ఇన్‌ఫెక్ట్ చేస్తుందని బృందం గుర్తించింది. HKU5-CoV-2 నేరుగా లేదా మాధ్యమజీవుల ద్వారా మనుషులకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ సామర్థ్యం కొవిడ్-19తో పోలిస్తే తక్కువేనని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.