మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలోని జల్గావ్‌లో జరిగిందీ ఘటన.
పుష్పక్ రైలులో మంటలు వచ్చాయంటూ వదంతులు వ్యాపించడంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు చైన్ లాగి ట్రైన్‌ను ఆపారు. చైను లాగడంతో రైలు నిలిచిపోయింది. ప్రయాణికులు కిందికి దిగి పక్కనున్న పట్టాలపైకి చేరుకోగా.. అదే సమయంలో దానిపై దూసుకొచ్చింది మరో రైలు. ఈ క్రమంలోనే పట్టాలపై ఉన్న ప్రయాణికుల మీదుగా రెండో రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు సమాచారం. వారిని ఢీ కొట్టిన ట్రైన్ కర్ణాటక ఎక్స్ ప్రెస్ గా తెలిసింది.