YS Sharmila | తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని YSRTP అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై(Governor Tamilisai)తో భేటీ అయిన ఆమె ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని.. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దాడులు చేస్తున్నారని విమర్శించారు. తొమ్మిది సంవత్సరాల్లో KCR తెలంగాణకు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం లేదని.. అందుకే రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌కు విజ్ఙప్తి చేశామని వెల్లడించారు.. త్వరలో రాష్ట్రపతిని కూడా కలిసి తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరతామని షర్మిల(YS Sharmila) వ్యాఖ్యానించారు.
Read Also: వామ్మో.. కుక్కల బెడదపై ఇన్ని వేల ఫిర్యాదులా?