అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనమని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని అమలు చేసేందుకు సంఘ్ పరివార్, బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇది భారత రాజ్యాంగానికి జరిగిన ఘోర అవమానమంటూ ఫైర్ అయ్యారు. దళిత, గిరిజన, బీసీ మైనార్టీల మనోభావాలను అమిత్‌షా దెబ్బతీశారంటూ ధ్వజమెత్తారు. మనుస్మృతిని బీజేపీ విశ్వసిస్తుంది కాబట్టే అనుక్షణం రాజ్యాంగంపై దాడికి పాల్పడుతోందని అన్నారు.