ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన అరెస్ట్‌ను రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు ప్రముఖులు ఖండించారు. అయితే హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలవ్వడంతో.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు.. స్పందిస్తున్నారు. ఈ క్రమంలో క్రమంలోనే తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హీరో అల్లు అర్జున్ అరెస్టుకు తమకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. అల్లు అర్జున్ పై తమకు ఎలాంటి కక్ష లేదని స్పష్టం చేశారు. ఆయన కారణంగా ఓ మహిళ చనిపోతే అరెస్ట్ చేయ వద్దా ప్రశ్నించారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ రావడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కారణమని గుర్తు చేశారు.