ఏపీ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో లేఖాస్త్రాన్ని సంధించారు. జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ వైఎస్‌ఆర్ అభిమానులకు ఆమె 3 పేజీల బహిరంగ లేఖ రాశారు. తన బిడ్డలకు సమానంగా ఆస్తులు ఇవ్వాలనేది వైఎస్సార్ అభిమతం అని..అందుకే తాను, తన తల్లి విజయమ్మ తపన పడుతున్నామని చెప్పారు. ఆస్తులు సమానంగా పంచాలని జగన్‌ను.. తన తల్లి విజయమ్మ ఇప్పటికీ వెయ్యిసార్లు అడిగి ఉంటుందని..వందల కొద్దీ లేఖలు రాసి ఉంటుందని తెలిపారు. అయినా తన బిడ్డలకు చెందాల్సి ఆస్తిలో ఏ ఒక్కటీ ఇవ్వలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో షర్మిల తాజా లేఖ రాజకీయవర్గాల్లో మరో హాట్ టాపిక్‌గా మారింది.