Payyavula Keshav: ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు హైకోర్టులో ఊరట లభించింది. కేవవ్ కు భద్రత కల్పించాల్సిందేనని హైకోర్టు(High Court) ఆదేశాలు జారీ చేసింది. అయితే ఐదు లేదా ఆరుగురు సెక్యూరిటీ సిబ్బంది పేర్లు ఇవ్వాలని పిటిషనర్ కు సూచించింది. అందులో ఇద్దరిని సెక్యూరిటీగా నియమించేందుకు ఆదేశాలు ఇస్తామని పేర్కొంది.
పిటీషనరే పేర్లు ఇవ్వాలని సూచించడం పట్ల అభ్యంతరం వ్యక్తం ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పిటిషనర్ కు ప్రభుత్వంపై నమ్మకం ఉండాలి కదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. గతంలో విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించినా.. ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో ప్రస్తుతానికి కేశవ్ కు(Payyavula Keshav) వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఇస్తూ ఆదేశాలు జారీ చేయడంతో పాటు పూర్తి విచారణ అనంతరం టూ ప్లస్ టూ సెక్యూరిటీపై తగిన చర్యలు తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది.
Read Also: MCD పీఠంపై ఆప్ జెండా.. మేయర్ గా షెల్లీ ఒబెరాయ్


