కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పూణె కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది లండన్‌లో స్వాతంత్ర్య సమర యోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మనవడు సత్యకి సావర్కర్ గతంలో పూణెలోని ఓ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. దీనికి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. కాగా.. ఈ కేసు గత నెలలో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యింది. దీనిపై నిన్న విచారణ జరిపిన కోర్టు అక్టోబర్ 23న తన ముందు హాజరుకావాలని రాహుల్‌కి సమన్లు జారీ చేసింది.