ఖమ్మం కలెక్టరేట్ వద్ద మంత్రి తుమ్మలకు నిరసన సెగ ఎదురైంది. కలెక్టరేట్ వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాన్వాయిని రైతు సంఘ నాయకులు అడ్డుకున్నారు. ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తుమ్మల హామీ ఇచ్చారు. ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని.. ప్రతి రైతుకూ రుణమాఫీ చేస్తామని తెలిపారు. పెండింగ్ ఖాతాల టెక్నికల్ సమస్య పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రత్యేక యాప్ ద్వారా కుటుంబ నిర్ధారణ జరుగుతోందన్నారు మంత్రి తుమ్మల.