సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల దశాబ్ధాల నాటి కల నెరవేరింది. జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ కేంద్రం తీపి కబురు చెప్పింది. మరి విలీనంతో కంటోన్మెంట్ పరిధిలో ఎలాంటి మార్పలు చోటు చేసుకో నున్నాయి.? కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి..? విలీనానికి ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు..?
జీహెచ్‌ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనంతో వారి చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని పౌర ప్రాంతాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ తీపి కబురు చెప్పింది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. వాటిని డీ- నోటిఫై చేసిన ట్లు వెల్లడించింది. సంబంధితనశాఖ అధికారి డిప్యూటీ డైరెక్టర్ హేమంత్ యాదవ్ దీనిపై సంతకం చేయడంతో హైదరాబాదీలు దశాబ్ధాలకాలం నుంచి ఎదురుచూస్తున్న చిరకాల వాంఛ నెలవేరినట్టయిం ది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనంతో ఇకపై పౌర ప్రాంతాలు, వార్డులు జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వస్తా యి. వాటిపై కంటోన్మెంట్ బోర్డ్ అధికారుల పర్యవేక్షణ ఉండబోదు. ఆయా ప్రాంతాలు, వార్డులు కూడా తమ సమీప మున్సిపాలిటీల్లోకి విలీనం అయ్యాయి. అయితే, దీనిపై జీహెచ్ఎంసీ అధికారిక ప్రక టన చేయాల్సి ఉంది.
సికింద్రబాద్ కంటోన్మెంట్ విలీనంపై ఇటీవలే ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌తో చర్చించారు. అలాగే మార్చి 5న రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి స్వయంగా విజ్ఞప్తి చేశారు. అయితే బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులన్నిటినీ రద్దు చేసి.. స్థానిక పురపాలక సంఘాలు, నగరపాలికల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విలీనా నికి సంబంధించిన విధివిధానాలను తాజాగా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కంటోన్మెంట్ విలీనానికి ఆమో దం తెలిపింది కేంద్రం. కంటోన్మెంట్ పౌరప్రాంతాలను విలీనం చేయడంతో ప్రజలకు సంబంధిం చిన మౌలిక సదుపాయాలన్నీ జీహెచ్‌ఎంసీకి ఉచితంగా బదిలీ అవుతాయి. ఇప్పటికే లీజుకు ఇచ్చినవి నగర పాలక సంస్థకు బదిలీ అవుతాయి. మిలిటరీ స్టేషన్ మినహా కంటోన్మెంట్‌లోని నివాస ప్రాంతాలకు జీహెచ్ ఎంసీ పరిధి విస్తరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పేరిట హక్కుగా ఉన్న భూములు, ఆస్తులు కేంద్రానికే దక్కు తాయి. ఈ ప్రాంతాలను విభజించేటప్పుడు సాయుధ బలగాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంటో న్మెంట్ బోర్డు బాధ్యుల సందేహాలను నివృత్తి చేసి తదుపరి కార్యాచరణ చేపట్టాలని కేంద్రం సూచిం చింది.