23.2 C
Hyderabad
Monday, October 27, 2025
spot_img

తృటిలో తప్పిన సైబర్ నేరం

   నివారణ కంటే నిరోధన ఉత్తమం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్, అడుసు తొక్కనేల, కాలు కడగ నేల ఇలా నీతి సూత్రాలు ఏ భాషలో, ఎవరు చెప్పినా ఆ మంచిని ఆచరించాల్సిన ఆవశ్యకత ఎంతై నా ఉంది.ఇక సైబర్ నేరాల విషయాలకు వస్తే, నేరగాళ్లను పట్టుకోవడం చాలా కష్టతరం అని అందరికీ తెలిసిందే. బాధితులకు సైబర్ క్రిమినల్స్ కుచ్చుటోపీ పెట్టి అందిన మేరకు దోచుకుని అడ్రస్ లేకుండా పోతున్నారు. హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి సైబర్ మోసగాళ్ల వలకు చిక్కా డు. అయితే, నగర సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా స్పందించడంతో లక్కీ ఈ ఉద్యోగి ఆర్థిక నేరగాళ్ల నుంచి సేవ్ అయ్యాడు.

సైబర్ నేరగాళ్లు ఎంతకైనా తెగిస్తున్నారు. సెల్ ఫోన్ కాల్స్, ఐస్ చేసే మాటలు, మోసగించే నేరగా ళ్లు, బుట్టలో పడే బాధితులు ఇటీవల జరుగుతున్న సైబర్ మోసాలన్నీ ఈ రీతన సాగుతున్నాయి. సైబర్ నేరగాళ్ల ట్రాప్ లో పడిన బాధితుడు లోన్ తీసుకొచ్చి మరీ మాయగాళ్ల బ్యాంక్ ఖాతాల్లో వేసి మోసపోయాడు. హైదరాబాద్ అంబర్ పేట్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఈ నెల 27 న గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆధార్ కార్డు నెంబర్ చెప్పి మరీ మోసానికి తెర లేపాడు. నిందితుడి కహానీతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గందరగోళా నికి గురయ్యాడు.

సైబర్ మోసగాడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఫోన్ చేసి, మీ ఆధార్ నెంబరుతో ఓ డ్రగ్ పార్శిల్ ముంబాయి నుంచి ఇరాన్‌కు వెళ్తోంది. దానిని ఫెడ్ ఎక్స్ కొరియర్ ద్వారా పంపిస్తున్నారు. వాటిని ముంబాయి పోలీసులు సీజ్ చేశారు అని సైబర్ కేటుగాడు పాపం ఆ ఉద్యోగిని తెగ బెదరగొట్టేశాడు. ఇప్పుడు మీ పేరు మీద కేసు నమోదైంది. ముంబయి పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపెట్టేశారు. వెంటనే మీరు స్కైప్ కాల్ లోకి వస్తే మిమ్మల్ని విచారించాల్సి ఉందని ఉక్కిరిబిక్కిరి చేశారు. స్కైప్ కాల్ లో మాట్లాడుతూనే నేరగాళ్లు కహానీలు మొదలెట్టారు.తాము తెలిపిన సొమ్మును మీ ఖాత నుంచి మా కు ట్రాన్సఫ్ ర్ చేస్తే, పరిశీలిన అనంతరం తిరిగి మీకు పంపిస్తామని ఏవో పొంతన లేని మాటలు చెప్పారు. అయితే, అప్పటికే అయోమయానికి గురైన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ముందు వెనుకలు ఆలో చించకుండా వాళ్లు చెప్పినట్టు చేసేశాడు. లోన్ తీసుకొచ్చి మరీ నేరగాడి బ్యాంక్ ఖాతాలో సొమ్ము వేసేశాడు. అయితే, చివరకు మోసం గ్రహించిన ఆ ఉద్యోగి ఈ నెల 27వ తేదీ సాయంత్రం సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు అందుకున్న హైదరా బాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా స్పందించారు. దీంతో, సాఫ్ట్ వేర్ ఉద్యోగి సేఫ్ జోన్ లో పడ్డాడు.

సీసీఎస్ సైబర్ క్రైమ్ ఎన్‌సీఆర్‌పీ పోర్టల్ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీకాంత్ నాయక్ చాకచక్యంగా పనిచేయడంతో ఈ కథ సుఖాంతం అయ్యింది. శ్రీకాంత్ నాయక్ సత్వర చర్యలతో కేవలం 11 నిమిషాల్లో 18 లక్షల రూపాయల సొమ్ము సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా ఆగింది. బ్యాంకు అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఖాతాలను స్తంభింప చేశారు.విషయం గ్రహించిన వెంటనే కానిస్టేబుల్ శ్రీకాంత్ నాయక్ బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం ఎన్‌సీఆర్‌ పీ పోర్టల్‌లో వివరాలను నమోదు చేసి సుమారు ఏడు గంటల సమయంలో బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి సైబర్ నేరగాళ్ల ఖాతాలకు వెళ్ళకుండా నిలిపేలా చేశాడు. ఇలా మొత్తం 11 నిమిషాల్లో 18 లక్షలు ఖాతాలోనే ఉండిపోవడంతో పోలీసులు, బాధితుడు ఊపిరి పీల్చుకున్నారు. వాటిని తిరిగి బాధితుడికి పోలీసులు ప్రక్రియ ద్వారా అందజేయనున్నారు. ఈ తరహా ఫోన్ కాల్స్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విచారణ, దర్యాప్తు వివరాల గురించి పోలీసులు ఎప్పుడూ ఫోన్ కాల్స్ చేయరని, నగదు బ్యాంకు ఖాతాల్లో జమ చేయమని వాట్సప్ లు, స్కైప్ కాల్స్ పోలీసులు చేయరని పోలీసుశాఖ ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. ఇలా ఎవరైనా ఫోన్స్ చేస్తే అది సైబర్ మోసగాళ్ల పనే అని గుర్తించుకోవాలని తెలిపారు. ఆ తరహా ఫోన్లకు ఆన్సర్ ఇవ్వవద్దని, వచ్చిన ఫోన్ నెంబరు వివరాలు పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసు ఉన్నతాధికా రులు చెబుతున్నారు. జీరో అవర్ ని ఉపయోగించుకోవాలని బాధితులకు పోలీసులు సూచిస్తు న్నారు.

———————————–

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్