జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్‌కు రాబోయేది అన్ని సవాళ్లేనా..?. ఒకవైపు అప్పులు, మరోవైపు వర్షాకాలం కష్టాలు పొంచి ఉన్నాయి..? అదనపు బాధ్యతలు ఆమ్రపాలికి భారంగా మారనున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వీటన్నిటికీ ఇటీవలే కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి ఏ విధంగా సమాధానం చెప్పబోతోంది.?
గ్రేటర్ హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపల్ కార్పొరేషన్‌లలో జీహెచ్ఎంసీ కీలక మైన కార్పొరేషన్. జీహెచ్ఎంసీలో తీసుకునే ఏ నిర్ణయమైనా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాల్సిందే. ఈ జీహెచ్ఎంసీలో తీసుకునే నిర్ణయం ప్రభుత్వ పని తీరుకు మార్కులు పడే విధంగా ఉంటాయి. అలాంటి జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిని యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్‌గా పేరొందిన ఆమ్రపాలికి బాధ్యతలు ఇచ్చారు. పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రేటర్ సిటీ పాలనపై దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రభుత్వం తన మార్క్ పాలనను గ్రేటర్ సిటీకి అందించాలనే ఆలోచనలో భాగంగానే ప్రస్తుతం కమిషనర్‌గా ఉన్న రోనాల్డ్ రోస్‌ను అక్కడి నుంచి తప్పించారనే టాక్ నడుస్తోంది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా జులై 5, 2023న బాధ్యత తీసుకున్న రోనాల్డ్ రోస్ మొదటిరోజు నుంచే పాలనలో వేగం పెంచారు. ఆస్తి పన్ను విభాగాన్ని ప్రక్షాళన చేశారు. పన్ను చెల్లింపులో జరుగుతున్న అవకతవకల కట్టడికి నగదు రహిత విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆర్థిక విభాగాన్ని పూర్తిగా డిజిటలీకరణ చేశారు. పైవంతెనల నిర్మాణ పనులను కొనసాగించడంపై దృష్టిపెట్టారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. ఓటరు జాబితా ప్రక్షాళన చేసి, పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగేందుకు కృషి చేశారు.ఇక కొత్త కమిషనర్ ఆమ్రపాలికి బల్దియా బాస్‌గా ప్రమోషన్ వచ్చినప్పటికీ రాబోయే కాలమంతా ఆమెకు సవాలుగానే ఉండనుంది. హైదరాబాద్ అభివృద్ధి పనులకు ఖజానాలో చిల్లిగవ్వ లేకపోవడంతో కాలనీల్లో రోడ్లతోపాటు ఇతరత్రా దాదాపు 1500 కోట్ల విలువైన పనులు నిలిచిపోయాయి. నిర్మాణంలో ఉన్న ఎస్ఆర్డీపీ, నాలాల విస్తరణ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే దాదాపు 6 వేల కోట్లు అవసరం. బల్దియాలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. లోక్‌సభ ఎన్నికలు పూర్తవడంతో మహానగరం విస్తరణ, అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈనేపథ్యంలో కొత్త కమిషనర్‌ను నియమించి వేగంగా పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమ్రపాలిని కమిషనర్‌గా నియమించారు. జీహెచ్ఎంసీ ఏర్పడ్డాక మొట్టమొదటి మహిళా కమిషనర్‌గా ఆమ్రపాలని నియమించారు.
వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది. ఈ సీజన్ అంత చిన్న చినుకు పడినా నగరం అంతా చిత్తడిలా మారు తోంది. వాటర్ లాగిన్ పాయింట్లు గుర్తించినట్లు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు అటు జలమండలి ఇటు జీహెచ్ఎంసీ చెప్తున్నప్ప టికీ చినుకు పడగానే రోడ్లపై నీళ్లు నిలిచిపోయి నదులను తలపిస్తు న్నాయి. రాబోయే వర్షాకాలం అంత జీహెచ్ఎంసీకి ఒక సవాలే అంటున్నారు అధికారులు. మరోవైపు సానిటేషన్‌కు సంబంధించిన అంశంపై ముఖ్యమంత్రి ఇప్పటికి రెండుసార్లు సమీక్ష నిర్వహించి హెచ్చరించారు. అయినా ఫీల్డ్ లెవల్‌లో అధికారుల పని తీరు మాత్రం మారడం లేదు. ఈ విషయంపై ఆమ్రపాలి తన మార్క్ ఏ రకంగా చూపిస్తారో చూడాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీహెచ్ఎంసీకి మొట్టమొదటి మహిళా కమిషనర్‌గా ఆమ్రపాలి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి వరకు నిర్వర్తించినటువంటి కమిషనర్లు వాళ్ల మార్క్ చూపించుకున్నారు. మరి రాబోయే రోజుల్లో ఆమ్రపాలి తన మార్క్ చూపిస్తారా, లేదా అనేది చూడాలి మరి.