త్వరలో నియమించబోయే వైస్ ఛాన్సలర్ పోస్టులను బీసీలకు 50 శాతం నియమించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమైన జేఎన్‌టీయూ, పాలమూరు, ఉస్మానియా, శాతవాహన యూనివ ర్సిటీలలో పోస్టులను బీసీలకు కేటాయించాలని తెలిపారు.యూనివర్సిటీలలో దాదాపు 2వేల 400 ప్రొఫెసర్ పోస్టు లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఖాళీలు భారీగా ఉన్నాయన్నారు. వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలలో రీసెర్చ్ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆర్ కృష్ణయ్య చెప్పారు. నామినేటెడ్ పోస్టుల్లో సైతం 50శాతం కోటా ఇవ్వాలన్నారు.