సూర్యాపేట జిల్లా కూచిపూడి ఆంజనేయస్వామి దేవాలయంలో సుదర్శన నరసింహ యాగం నిర్వహిం చారు. గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ యాగాన్ని చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు లక్ష్మీనరసింహాచార్యులు ఆధ్వర్యంలో ఈ యాగం జరిగింది. గ్రామ ప్రజలంతా సుఖశాంతులతో, పాడిపంటల వర్ధిల్లాలని సంకల్పించి యాగం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. దేవాలయం అభివృద్ధి, దేవాలయం నిర్మాణం త్వరగా పూర్తి కావడం కోసం ఈ కార్యక్రమాన్ని సంకల్పించామన్నారు. గ్రామంలో ఓకేచోట ఎనిమిది దేవాలయా లు ఉన్నాయని, కూచిపూడి త్వరలోనే పుణ్యక్షేత్రం అవుతుందన్నారు.